సీఎం రమేష్ ప్రాణాలకు తెగించి దీక్ష చేస్తుంటే.. ప్రధానికి చీమ కుట్టినట్టు కూడా లేదు: రాయపాటి

  • 420లకు పీఎంఓ అపాయింట్ మెంట్ ఇస్తుంది
  • ప్రజా సేవకులకు ‘నో’ అని చెబుతోంది
  • తెలుగు ప్రజలను మోదీ అవమానిస్తున్నారు
ఉక్కు ఫ్యాక్టరీ కోసం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేస్తున్న ఆమరణదీక్ష గురించి ప్రధాని మోదీని కలిసి... వివరించాలనుకున్న టీడీపీ ఎంపీలకు నిరాశ ఎదురైన విషయం తెలిసిందే. ఈ విషయమై ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పందిస్తూ.. టీడీపీ ఎంపీలకు ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడమంటే.. తెలుగు ప్రజలను అవమానించడమేనని అన్నారు.

420లకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) అపాయింట్ మెంట్ ఇస్తూ ప్రజాసేవకులకు ‘నో’ అంటోందని, కేసుల మాఫీ కోసం వచ్చే వారికే అపాయింట్ మెంట్ ఇస్తారా? అని మండిపడ్డారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం సీఎం రమేష్ ప్రాణాలకు తెగించి దీక్ష చేస్తుంటే.. ప్రధానికి చీమ కుట్టినట్టు కూడా లేదని దుయ్యబట్టారు.

rayapati
modi

More Telugu News